Tuesday, October 13, 2026

దసరాకు నామినేటెడ్ పదవులు భర్తీ?

హైదరాబాద్, కలం నిఘా న్యూస్ ప్రతినిధి : సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పోస్టులు, ఇతర కీలక పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరు కున్నట్లు సమాచారం. అన్ని స్థానాల్లో ఖాళీ గా ఉన్న నామినేటెడ్‌ పదవుల భర్తీ కోసం అర్హులైన, క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యక ర్తల పేర్లతో కూడిన ప్రతి పాదనలను వారం రోజుల్లోగా సమర్పించాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్ని జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులకు స్పష్టమై న సూచనలు ఇచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే… ఈ పదవుల ఎంపిక, వర్గీకరణకు సంబంధించి ఇటీవల న్యూఢిల్లీలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డితో సమగ్రంగా చర్చించి నట్లు ఆయన వెల్లడిం చారు. అధికారంలోకి రావడం కోసం క్షేత్రస్థా యిలో చెమటోడ్చిన నిజమైన కాంగ్రెస్ సైనికులకు తగిన గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం అడుగులు వేస్తోందన్నారు. అయితే ఈ దసరా పండుగను పురస్కరించుకొని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకున్నది. ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గా ఉన్న మీనాక్షి నటరాజన్ విదేశీ పర్యటనలకు వెళ్లడం ఆ స్థానంలో కొత్త గా ఎవరిని నియమించ లేదు, దీంతో నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీ నేత కేసి వేణుగోపాల్ తో చర్చించి తుది నిర్ణ యం తీసుకొనున్నా రు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే దసరా పండుగ సందర్భంగా కొందరికి నామినేటెడ్ పదవుల వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular