హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు భారీ గా పెరగనున్నాయి. త్వరలో దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ధరలు పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. మద్యం ధరల పెంపు నకు సంబంధించి రేవంత్ సర్కార్ ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ఇటీవల వివిధ మద్యం తయారీ కంపెనీలతో సమావేశమైంది. అనంతరం పెరుగు తున్న ఖర్చుల కారణంగా మద్యం ధరలను పెంచాల్సిం దేనని కమిటీ ఓ నివేదిక సమర్పించిం ది. ఈ రిపోర్ట్ పరిశీల న అనంతరం.. మద్యం కంపెనీల డిమాండ్ల మేరకు ధరలను పెంచేందుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మందుబాబులపై మరింత భారాన్ని మోప నుంది. దాదాపు 20 శాతం మేరకు ధరలను పెంచనున్నారని తెలుస్తోంది.ప్రీమియం బ్రాండ్లకు సంబంధించి ఫుల్ బాటిల్‌పై రూ.100 వరకు పెరిగే అవకాశ ముండగా.. హయ్యర్ క్యాటగిరీ బ్రాండ్లపై రూ.120 పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఎక్కువ మంది కొనుగోలు చేసే చీప్ లిక్కర్ బ్రాండ్లపై రూ.90 వరకు పెరిగే అవకాశముందని తెలుస్తోంది.


