హైదరాబాద్, నిఘా న్యూస్: బీసీలకు 50%శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన,అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
సోమవారం సాయం త్రం బంజారాహిల్స్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ బీసీ నాయకులు సమావేశంలో ఆమె మాట్లాడారు. రిజర్వే షన్లు సాధనకు సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ పేరుతో భారీ సభ నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
బీసీలతోపాటు.. అన్ని వర్గాల వారిని ఒక్క తాటిపై తెస్తా మన్నారు. ఆగస్టు 6న దేశ గతినే మార్చేస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.


