హైదరాబాద్,నిఘా న్యూస్ ప్రతినిధి:దీపావళి పండుగతో అశ్యయుజ మాసం ముగియనుండగా రేపటి నుంచి భక్తులకు ఎంతో ప్రాధాన్యమైన కార్తీక మాసం ప్రారంభం కానుంది, మాఘ మాసంలో ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవాను డు, శ్రావణ మాసం లో శ్రీలక్ష్మిదేవి, ఆశ్వయుజ మాసం లో దుర్గాదేవి, కార్తీకమాసంలో శివుడు, మార్గశిర మాసంలో శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో భక్తులు పూజిస్తారు.
దీపావళి అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగుస్తుంది. అనంతరం కార్తీక మాసం ప్రారంభమ వుతుంది,2026, నవంబర్ 10వ తేదీ అనగా..రేపు మంగళవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. డిసెంబర్ 8వ తేదీ మంగళవారంతో ఈ మాసం ముగియ నుంది.ఈ మాసం లో పండుగలు అధికంగా ఉంటాయి.
కార్తీకమాస పండగల వివరాలు
నవంబర్ 13 : నాగుల చవితి
నవంబర్ 14: నాగ పంచమి
నవంబర్ 16: మొదటి కార్తీక సోమవారం.
నవంబర్ 21: క్షీరాబ్ది ద్వాదశి
నవంబర్ 23: రెండో కార్తీక సోమవారం
నవంబర్ 24: కార్తీక పౌర్ణమి
నవంబర్ 30: మూడో కార్తీక సోమవారం
డిసెంబర్ 06: నాలుగో కార్తీక సోమవారం మాస శివరాత్రి


