Wednesday, July 29, 2026

తెలంగాణ జిల్లాల్లో దంచి కొడుతున్న వానలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది, నిన్న మెున్నటి వరకు వర్షాలు లేక తీవ్ర ఉక్కపోత, వేడితో అల్లాడిన ప్రజలకు ఊరట లభించింది.

తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు మంగళవారం రాత్రి నుంచి దంచికొడుతు న్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరా బాద్, మేడ్చల్‌- మల్కాజిగిరి, రంగా రెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్‌ తదితర జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.

మంగళవారం అత్య ధికంగా ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరా పూర్‌లో 5.8 సెం.మీ., తాంసి, తలమడుగు, ఇచ్చోడ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వికారా బాద్, వరంగల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోనూ వానలు దంచికొట్టాయి.

ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలపై కేంద్రీ కృతమైన తీవ్ర వాయుగుండం దక్షిణ ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతు పవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించడం తో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, జిల్లాలతోపాటు…

సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని చెప్పారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular