మహబూబ్‌నగర్, నిఘా న్యూస్: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ లో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేకలను తరలిస్తున్న డీసీఎం వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్‌తో పాటు సుమారు 200 మేకలు సజీవ దహనమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో జాతీయ రహదారి- కర్నూలు మార్గంలో మేకల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ రోడ్డు ప్రక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టింది దీంతో వాహనంలో మంటలు చెదరేగాయి..
వాహనంలోని డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగి నట్లు సమాచారం. మంటలు భారీగా వ్యాపించడంతో క్షణంలో డీసీఎం వ్యాన్ కాలిపోయింది వ్యానులో చిక్కుకున్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదు గురు గాయపడ్డట్లు తెలుస్తుంది..
వాహనంలో ఉన్న 200 వందలకు పైగా మేకలు కూడా మంటల్లో చిక్కుకుని సజీవ దహనమ య్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదంలో జరిగిన నష్టంపై అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఘట నకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


