Friday, November 20, 2026

విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్,అన్నా లెజినోవా?

అమరావతి, కలం నిఘా న్యూస్: తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నామని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్,కొణిదెల అన్నా, సంయుక్తం గా వెల్లడించారు. విశ్వాసనీయ సమాచారం మేరకు…ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకు న్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ప్రెస్ నోట్ విడుదల చేసారు.ఈ ప్రెస్ నోట్ లో.. పరస్పర అంగీకారం, అవగాహనతో విడిపోవాలని నిర్ణ యం తీసుకున్న మని జీవితంలో ఎంతో కాలం కలిసి ప్రయాణించిన తర్వాత ఈ నిర్ణ యం తీసుకున్నాం. మా వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నాం. విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతామని రాశారు.

పిల్లల తల్లిదండ్రులు గా మా బాధ్యతలు కొనసాగిస్తాం. పిల్లల సంతోషం, భవిష్యత్తే మా ఇద్దరి ఉమ్మడి ప్రాధాన్యత. ఈ వ్యక్తిగత పరిణామం లో మా గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాం. మా ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.దీంతో పవన్ విడాకులు వార్త సంచలనంగా మారింది. గతంలో ఆల్రెడీ రెండు సార్లు విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు విడాకులు ప్రకటించడంతో ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇటీవల కొన్ని రోజుల ముందు నుంచి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో మాట్లా డుతూ,

భారత సాంప్రదా యాలను గౌరవిస్తూ, పవన్ గురించి పోస్టులు పెట్టి ఇలా సడెన్ గా విడాకులు ప్రకటించడంతో ఆశ్చర్యపోతున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular