Friday, September 18, 2026

నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు నాయుడు!

అమరావతి, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయు డు రెండు రోజుల పాటు తిరుమల తిరుపతిలో పర్యటిం చనున్నారు మంగళ వారం సాయంత్రం తిరుపతికి చేరుకున్న అనంతరం తిరుమల కొండపైకి వెళ్లి స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. సీఎం హోదాలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిం చిన అనంతరం తిరుమలలో ప్రసిద్ధి చెందిన బేడీ ఆంజనే యస్వామిని దర్శిం చుకుని ప్రత్యేక పూజ లు నిర్వహిస్తారు.

సీఎం చంద్రబాబు పర్యటన పూర్తి షెడ్యూల్!

సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం 4 గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారుసాయంత్రం 5.30 గంటలకు తిరుపతి లోని ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు తిరుమల ఆనంద నిలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత, 7.55 నుంచి 9.15 గంటల మధ్య శ్రీవారిని దర్శించుకుంటారు.

అనంతరం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రేపు రాత్రికి శ్రీ గాయత్రి నిలయంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.సెప్టెంబర్ 16న ఉదయం 8.40 గంటలకు తిరుమల వీక్యూ సీ-1లో పిల్‌గ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభి స్తారు. ఉదయం 9.15 గంటలకు గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించను న్నారు

9.35 గంటలకు ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం నిర్వ హిస్తారు. ఉదయం 10.25 నుంచి 11.25 గంటల వరకు శ్రీ పద్మావతి రెస్ట్ హౌస్‌లో సమావేశా ల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 1.55 గంటలకు ఉండవల్లి నివాసానికి తిరిగి చేరుకొనున్నా రు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular