పెద్దపల్లి జిల్లా, నిఘా న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరుడి ఆలయంలోతొలి ఏకాదశి సందర్భంగా శనివారం భక్తులతో సందడి నెలకొంది, అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
ఉదయమే స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరివార దేవతలకు అర్చనలు నిర్వహించారు. విఠలేశ్వర స్వామి వారికి మహా పూజను వైభవంగా నిర్వహించారు.
కాగా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ సమీపంలో గల గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివ చ్చారు. గోదావరి నదిలో పుణ్య స్థానా లు ఆచరించిన అనం తరం శ్రీ గౌతమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గోదావరి నది తీరాన గల శ్రీ ఆంజనేయ స్వామి, గౌతమేశ్వర ఆలయంతో పాటు.. పట్టణంలోని ఇతర దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన లు నిర్వహించి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని,తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.
తొలి ఏకాదశి పర్వదినం సందర్భం గా గోదావరి నది ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలా డాయి. భక్తుల రాక తో మంథని పుణ్య క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించు కుంది. ఈ మేరకు మంథని మున్సిపా లిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, తోపాటు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గోదావరి నదిని సందర్శించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగ కుండా పర్యవేక్షించా రు. భక్తులకు ఎలాం టి ఆటంకాలు, అవం చనీయ సంఘటనలు జరగకుండా పోలీసు లు భారీ బందోబస్తు నిర్వహించారు.


