Tuesday, July 21, 2026

గిరిజన మహిళపై అటవీశాఖ అధికారుల దాడి!

కొత్తగూడెం, నిఘా న్యూస్: వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు గిరిజన గ్రామాల్లోని రైతులకు ఫారెస్ట్ అధికారులకు పోడు భూముల లొల్లి మొదలవుతుంది, రైతులు ఆ భూము లను సాగు చేయుడా నికి వెళ్లడం అటవీ శాఖ వారు అడ్డు కోవడం పరిపాటిగా మారిపోయింది,

తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల పోరు మరోసారి ఉద్రిక్తత కు దారి తీసింది, అశ్వాపురం మండలం మాను బోతుల గూడెంలో ఫారెస్ట్ అధికారులు గిరిజన మహిళల మధ్య గొడవ స్పర స్పర దాడుల వరకు వెళ్ళింది.

మను బోతుల గూడెం పూర్తిగా మారుమూల గిరిజన గ్రామం సుమారు 30 సంవత్సరాలుగా అక్కడి వలస గిరిజ నులు పోడు భూము లను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే ఈ గ్రామానికి వెళ్ళడానికి సరైన రహదారులు లేకపోవడం కనీసం ఫోన్ కు సిగ్నల్ కూడా ఉండకపో వడంతో అక్కడ జరిగిన గొడవ ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది.

మణుగూరు ఫారెస్ట్ రేంజర్ ఉపేందర్, నేతృత్వంలో సుమారు 40 మంది సిబ్బంది ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకె ళ్లారు.పోడు వ్యవసాయం చేసు కుంటున్న గిరిజనుల తో మొదట వాగ్వా దానికి దిగిన ఫారెస్ట్ సిబ్బంది,తరువాత దాడికి పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

కనీసం మహిళలు అని చూడకుండా విసిరిపాలయడంతో ముగ్గురు గిరిజన మహిళలు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం వారిని మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular