చొప్పదండి, నిఘా న్యూస్: భూభారతి రీసర్వే ప్రక్రియపై కోనేరుపల్లి గ్రామ రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రీసర్వేకు సంబంధించిన అంశాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూ వివరాల పరిశీలన తదితర విషయాలపై రైతులకు అధికారులు సూచనలు అందించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ పి. నవీన్‌కుమార్, ఏడి కిషన్‌రావు, ఎంపీడీవో వేణుగోపాలరావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రామేశ్వర గణపతి, సర్పంచ్ వేణుగోపాలరాజు, సర్వేయర్ శ్రీనివాస్, ఆర్‌ఐ త్రిపాల్‌సింగ్, గ్రామ పాలనాధికారి వీరేందర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ తిరుపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అలాగే గ్రామానికి చెందిన పలువురు రైతులు హాజరై భూభారతి రీసర్వేకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ భూ వివరాలను పరిశీలించుకుని, రీసర్వే ప్రక్రియలో అధికారులు సూచించే విధంగా సహకరించాలని అధికారులు కోరారు.


