హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణలో విద్యార్థు లకు వరుసగా మూడు రోజులు సెలవు దొరికే అవకాశం కనిపిస్తుంది, విద్యారంగానికి సంబం ధించిన పలు సమ స్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిం చాలని కోరుతూ వామపక్షాలవిద్యార్థి సంఘాలు జులై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి.
ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళా శాలలు మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు.
ఈ బంద్‌తో పాటు జులై 11న రెండో శనివారం, జులై 12న ఆదివారం కూడా సెలవులు ఉండటంతో విద్యార్థులకు వరుస గా మూడు రోజుల పాటు విరామం లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థు ల సమస్యలను తక్ష ణమే పరిష్కరించాల ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


