Thursday, July 23, 2026

రేపు తెలంగాణలో విద్యాసంస్థలు బంద్*

నిఘా న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24 శుక్రవారం పలు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘా లు పిలుపు నిచ్చా యి, నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించడం తోపాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీ నామా చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయ కులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.24న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్‌ను ప్రతి ఒక్కరూ విజయ వంతం చేయాలని ఏఐఎస్ఎఫ్‌, ఎస్‌ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్‌, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ సంఘాలు బుధ వారం ఒక ప్రకటనలో తెలిపాయి. విద్యా ర్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, సహకరించచాలని కోరాయి. దేశ విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించా లని సంఘాల ప్రతి నిధులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌, టి.నాగరాజు, వెంకటస్వామి, పల్లె మురళి డిమాండ్‌ చేశారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular