Monday, January 19, 2026

ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…

రుద్రవరం లో ఇందిరా మహిళా శక్తి యూనిట్లు ప్రారంభించిన ప్రభుత్వ విప్

వేములవాడ, నిఘా న్యూస్: ఇందిరా మహిళా శక్తి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. బుధవారం వేములవాడ పట్టణంలో బ్యూటి పార్లల్, వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు..అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అంబేద్కర్ స్వయం స్వసక్తి సంఘం వారి ఆద్వర్యంలో డైరీ పార్లర్, శ్రీ లక్ష్మీ స్వయం స్వసక్తి సంఘం వారి ఆద్వర్యంలో లేడీస్ ఎంపోరియంను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు..వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తుందని పేర్కొన్నారు…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళను కోటీశ్వరులు గా చేసే లక్ష్యంతో ముందుకు పోతున్నారు.. ప్రతి ఏటా 20 వేల కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతు మహిళా సాధికారికత లక్ష్యంగా ముందుకు పోతున్నారు..

గతంలో మహిళలను లక్ష అధికారులు చేయడం లక్ష్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు పావలా వడ్డీ కి రుణాలు మంజూరు, తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి వడ్డీలేని రుణాలను మంజూరు చేశారని గుర్తచేశారు..మళ్లీ ప్రజా ప్రభుత్వంలో మహిళా అభివృద్ధి లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు పోతుంది.. జిల్లాలో ఇంచుమించు 9985 మహిళా సంఘాలలోని 109000 మంది సభ్యులు ఉన్న వారిలో ఎవరైతే ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వస్తున్నారో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 600 కోట్లుతో వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నాం తెలిపారు… 7079 మందికి యూనిట్ల కు ప్రస్తుతం 3030 మందికి నిధులు మంజూరు అయ్యాయని పేరొన్నారు..

మహిళలకు ఉపాధి కోసం 125 రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నారని అందులో భాగంగా యువతకు ఉపయోగపడే ఓపెన్ జిమ్ కు భూమి పూజ నిర్వహించామని పేర్కొన్నారు..

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular