Monday, January 19, 2026

క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి

2032 ఒలంపిక్స్ లో పథకమే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేయడమే సీఎం కప్ ఉద్దేశం

క్రీడల ప్రోత్సాహానికి రాష్ట్రంలో కోర్టు యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి

విద్యకు, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం

చొప్పదండి నియోజకవర్గం లో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందజేస్తాం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సీఎం కప్ పేరుతో క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. 2032 లో జరిగే ఒలంపిక్స్ లో పథకమే లక్ష్యంగా క్రీడాకారులను తయారు చేయడానికి సీఎం కప్ ఉపయోగపడుతోందని, రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని చెప్పారు.

విడతల వారీగా రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, చొప్పదండి నియోజకవర్గం లో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సంపూర్ణ సహాయ సహకారాలను అందజేస్తామన్నారు. విద్యార్థులు చదువుతోపాటుగా క్రీడలను భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, గంగాధర మార్కెట్ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, గంగాధర సింగల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, గంగాధర మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీవో రామ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, నాయకులు దుబ్బాసి బుచ్చయ్య ,సత్తు కనుకయ్య, పడాల రాజన్న,బుర్గు గంగన్న,జాగిరపు శ్రీనివాసరెడ్డి ,రోమాల రమేష్ ,గునుకొండ బాబు ,గుజ్జుల బాపురెడ్డి ,దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, గంగాధర సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular