Monday, August 31, 2026

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

అమరావతి, నిఘా న్యూస్: మార్కాపురం జిల్లా ప్రజల చిలకాల స్వప్నం సహకార మైంది, వెలిగొండ నీటి ప్రాజెక్టు తొలి దశను సీఎం చంద్ర బాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

సోమవారం ఉదయం దోర్నాల మండలం గంటావానిపల్లి వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకి జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. కృష్ణా జలాలను తలపై చల్లుకున్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం.. జాతికి అంకితం చేశారు.

ఆపై నల్లమల సాగర్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపలో కరవు ప్రాంతాలకు జలకళ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular