Monday, August 31, 2026

నేపాల్‌లో 900 దాటిన మృతుల సంఖ్య..

హైదరాబాద్, నిఘా న్యూస్: పోరుగు దేశమైన నేపాల్ ను భారీ వర దలు అతలకుతలం చేశాయి ఈ జలప్రళయంలో మృతుల సంఖ్యా 900 దాటింది, ఈరోజు నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 903 మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించాయి.

ఈ ఘటనలో గల్లం తైన వారి సంఖ్య 4,000 మందిపైనే ఉంటుందని అంచనా. ఇందులో 320 మంది విదేశీయుల అచూకీ కూడా లభించలేదు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నేపాల్‌కు చెందిన నేషనల్ డిజాస్టర్ రిస్క్ రెడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎన్‌డీఆర్‌ ఆర్‌ఎంఏ అధికారుల ప్రకారం అనేక ప్రాంతాల నుంచి మృతదేహాల్ని సిబ్బం ది గుర్తిస్తున్నారు.

తాజా పరిణామాలపై నేపాల్ ప్రధాని బాలెంద్ర షా కీలక ప్రకటన చేశారు. దేశం ఎప్పుడూ ఊహించని, హృదయవిదారకమైన విపత్తును ఎదుర్కుంటోంది అన్నారు. వాతావర ణం అనుకూలించక పోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోం దని అన్నారు.

ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో నదులు ఉప్పొంగు తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండా లని సూచించారు. పరిస్థితులు అనుకూ లంగా లేనందువల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటి అంశాల్లో స్పష్టత రావడం లేదన్నారు. అయినప్పటికీ ప్రజల ప్రాణాల రక్షణ కోసం అంకితభావంతో కృషి చేస్తున్నామని వివరించారు.

మరోవైపు మృతదేహా ల్ని భద్రపరచడానికి, ఖననం చేయడానికి కూడా నేపాల్‌లో సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేపాల్‌కు ఇండియా, చైనా వంటి దేశాలు ప్రస్తుతం సహాయం అందిస్తున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular