హైదరాబాద్, నిఘా న్యూస్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం,గడీల పాలనకు, దొరల అహంకారానికి వ్యతి రేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
భూస్వామ్య దోపిడీకి, నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, పేదలు, బలహీన వర్గాల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిందని పేర్కొ న్నారు. సామాజిక న్యాయం, సమాన త్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదా యకమని ఆయన కొనియాడారు.
అన్యాయాన్ని ప్రశ్నిం చే ధైర్యం, హక్కుల కోసం పోరాడే సంకల్పం, సమాజ శ్రేయస్సు కోసం నిలబడే నిబద్ధత మనందరిలో ఉండా లని చాకలి ఐలమ్మ, జీవితం మనకు చాటి చెబుతోందని ముఖ్య మంత్రి పేర్కొన్నారు.


