Tuesday, January 20, 2026

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..

వేములవాడ జూలై 25.(నిఘా న్యూస్)వేములవాడ..ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ లో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వేములవాడ తెలంగాణ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దాహనం చేయడం జరిగింది ఎన్నో హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే తెలంగాణకు ఇచ్చింది. కేంద్రం పెద్ద గుడ్డు మాత్రమే అని అవహేళన చేసే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించాడు 2014 నుండి నేటి వరకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు ఎనిమిది లక్షల కోట్ల నిధులు కేటాయించడం జరిగింది.మరి ఎన్నో హామీలతో తెలంగాణలో గద్దెనెక్కిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పెద్ద శతకోపం పెట్టింది సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి 5000 కోట్లు కేటాయించుకొని ఎన్నో హామీలతో దేవాలయం అభివృద్ధి చేస్తానని 100 కోట్లు కేటాయిస్తామని మాయ మాటలు చెప్పి దేవాలయానికి నిధులు కేటాయించకపోవడం ముంపు గ్రామాల్లో పారిశ్రామిక కారిడార్ పూసే లేకపోవడం ఒంటరి మహిళలకు పెన్షన్ ప్రారంభించకపోవడం ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటు కల్పించకపోవడం ఇలా అనేక వాగ్దానాలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందని స్థానిక సమస్యలను తన దృష్టిలోకి తీసుకువస్తే తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తారని ప్రసాదం స్కీంలో దేవాలయ ప్రతిపాదన పంపితే వెంటనే కేంద్రం నుండి ప్రసాదం కి మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులు సహకారం తీసుకొని వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బిజెపి పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు అయితే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరిని బట్టబయలు చేస్తామని చెప్పి తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి,పిన్నింటి హనుమన్లు,మెరుగు లక్ష్మణ్,మైలారం శ్రీనివాస్ బిల్లా కృష్ణ, కోల మారుతి,నేరెళ్ల సాయి,చిలువేరి బాబు బోయిన సంపత్ , నేరెళ్ల కిరణ్,బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది…

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular