Friday, May 15, 2026

పెద్దపల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య?

పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లాలో ఓ దళిత యువకుడి దారుణ హత్యతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి, ఈ హత్యకు ప్రేమ వ్యవ హారమే కారణమని పోలీసులు అనుమాని స్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం…

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామాని కి చెందిన జూల వంశీ అనే దళిత యువకు డు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలోని దట్టమైన అడవిలో కుళ్ళిన స్థితిలో యు వకుడి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది.

ఏప్రిల్ 30న కనబడ కుండా పోవడంతో మూడు నాలుగు రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతుడి కాల్ డేటా ఆధారంగా హైదరాబా ద్ కు సంబంధించిన ఒక యువతిని కలవ డానికి వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు ఆ యువతిని ఆమె భర్తను తీసుకొచ్చి విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

ప్రేమ వ్యవహారమే కారణం

సింగిరెడ్డిపల్లికి చెందిన వంశీ అదే గ్రామానికి చెందిన ఒక యువతి తో ప్రేమ వ్యవహారం నడిపాడు. తర్వాత క్రమంలో ఆమె వేరొ కరిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు తెలిసింది. కాగా ఇటీవల గ్రామ దేవతల కొలుపు సందర్భంగా తిరిగి గ్రామానికి వచ్చిన యువతితో మళ్లీ అతను చనువుగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి.

ఇది తెలిసిన ఆ యువతి భర్త చాక చక్యంగా ఆ యువతి తోటే అతన్ని ఏప్రిల్ 30న హైదరాబాద్ కు పిలిపించి హత్య చేసి అతని శవాన్ని మంథని సమీపంలోని గాడిదల గండిలో వేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకోవడం తో వంశీ మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్య మైనట్లు సమాచారం.

హత్య జరిగి సుమారు పది రోజులు కావడం తో అతని మృతదే హం పూర్తిగా కుళ్లిన స్థితిలో లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular