Sunday, September 20, 2026

మాజీ సీఎం కెసిఆర్ అధ్యక్షతన నేడు బిఆర్ఎస్ ఎల్పీ సమావేశం!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం ఈరోజు జరగనుంది, పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి లోని ఆయన ఫాం హౌస్ లో ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంట లకు జరగనుంది,

శాసనసభ, మండలి లో అధికార పక్షాన్ని నిలదీసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై నిరసనలు చేస్తున్న గులాబీ పార్టీ చట్టసభల వేదికగా కూడా సర్కార్ వైఖరి ని ఎండగట్టాలని భావిస్తోంది. సమా వేశాల్లో అనుసరించా ల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్​ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న తరుణం లో జరుగుతున్న సమావేశాలు వాడీ వేడిగా సాగనున్నా యి. 1000 రోజుల పాలనపై ఇప్పటికే ఛార్జ్​షీట్ విడుదల చేసిన భారత రాష్ట్ర సమితి ఇంటింటికీ బాకీ కార్డులు పంచడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర సన కార్యక్రమాలు చేపట్టింది.

2023 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు కాకపోవడాన్ని పదే పదే గుర్తు చేస్తోంది. అసెంబ్లీ, మండలి వేదికగా కూడా సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. రైతులు, నిరుద్యోగులు, ఉద్యో గులు, విద్యార్థులు, మహిళలు, పేదలు, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించా లని పార్టీ యోచి స్తోంది.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలులో జాప్యాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని బీఆర్​ఎస్ భావిస్తోంది. రైతుల సమస్యలు, సాగు నీటి అంశాలు, ప్రాజెక్టుల పరిస్థితి, ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన కూడా ప్రధానంగా కనిపిస్తోంది. 22ఏ నిషేధిత జాబితా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించనున్నట్లు సమాచారం.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular