Friday, November 20, 2026

కోనసీమ జిల్లాలో మళ్లీ గ్యాస్ లీకేజీ?

కోనసీమ జిల్లా, నిఘా న్యూస్ ప్రతినిధి:గత నెల అక్టోబర్ 26న అంబాజీపేట మండలంలో గ్యాస్ లీక్ అయిన ఘటన జిల్లా ప్రజలు మరువక ముందే అలాంటి ఘటనే మళ్లీ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది,డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ బ్లోఅవుట్ కలకలం రేపింది.

మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మంగళ వారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది, స్థానికం గా ఉన్న తాడివారి మెరక వద్ద ఓఎన్‌జీ సీ అధికారులు రీడ్రిల్లింగ్‌ పనులు చేపట్టారు. ఈ పాయింట్‌ నుంచే అకస్మాత్తుగా సీఎన్‌ జీ గ్యాస్‌ భారీగా లీకైంది.

దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించింది.తెల్లవారుజామున నిద్రలో ఉన్న స్థాని కులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గ్యాస్ వాసన రావడం, భారీ శబ్దం వినిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

సీఎన్‌జీ గ్యాస్‌ క్రమంగా నగరం పరిసర ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా వేగంగా విస్తరిస్తోం ది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు గుర్తుకొచ్చి జనం వణికిపోతున్నారు

గ్యాస్ బ్లోఅవుట్ సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్‌జీసీ అధికారులు అప్రమత్తమయ్యారుహుటాహుటిన క్షేత్రస్థాయికి చేరు కున్నారు. గ్యాస్‌ లీక్‌ను అరికట్టేందు కు అత్యవసర చర్యలు చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పకుండా అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు.

గ్యాస్‌ బావి వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ మంటలు చెలరేగకుండా ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గ్యాస్‌ బ్లోఅవుట్‌ చుట్టూ మంటలు వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు అత్యవసరంగా వాటర్‌ అంబ్రెల్లాను ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా నీటిని వెదజల్లుతూ ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతున్నారు. గ్యాస్ లీకేజీని పూర్తిగా అరికట్టి, పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు ము మ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular