హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ మంత్రి కొండ సురేఖ బర్తరఫ్ కు రంగం సిద్ధమైంది, క్యాబినెట్ నుంచి ఆమెను తొలగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కొండా సురేఖ రాజీ నామా చేస్తారా?.. బర్తరఫ్ చేస్తారా అంటూ కొనసాగు తున్న ఉత్కంఠకు తెరపడింది.
ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆమోద ముద్ర లభించగానే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సురేఖను బర్తరఫ్ చేస్తూ సిఫారసు లేఖను గురువారం గవర్నర్ కు పంపించారు. రాజీనామాకు కొండా సురేఖ అంగీకరించ కపోవడంతో లోక్‌భవన్‌కు సీఎంవో లేఖ పంపించింది.
మరోవైపు చిన్నారెడ్డి పై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చెన్నారెడ్డిని తొలగి స్తూ నిర్ణయం తీసు కుంది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియ మించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా గుండు సుధారాణి ని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.


