Thursday, September 3, 2026

బొల్లారం ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్ల కలకలం

హైదరాబాద్, నిఘా న్యూస్: హైదరాబాద్‌ లోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపుకు సమీ పంలో డిటోనేటర్లు కలకలం రేపాయి, ఫైరింగ్ రేంజ్ వెనక గోడ సమీపంలో ఓ ప్లాస్టిక్ బకెట్లో 160 ఎలక్ట్రానిక్ డిటోనే టర్లు లభించడంతో ఆర్మీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించా రు. మల్కాజిగిరి బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌ సూచనల మేరకు డిటోనేటర్లను భద్రపరిచినట్లు సమాచారం. వాటిని అక్కడ ఎవరు వదిలి వెళ్లారు ? ఏదైనా పని లో భాగంగా అక్కడికి తీసుకొచ్చారా ? లేక ఇతర ప్రాంతం నుంచి తరలించి అక్కడ పడేశారా ? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు.

లభ్యమైన డిటోనేటర్ల విలువ సుమారు రూ.32 వేల వరకు ఉంటుందని సమాచా రం. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న ఆర్మీ పరిధిలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఈ ఘటన చోటుచే సుకోవటం చర్చకు దారితీయగా.. అధికా రులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యం గా ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు జరుగు తున్న సమయంలోనే డిటోనేటర్లు బయట పడటంతో పోలీసు లు దీనిని సీరియస్‌ గా తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. రెండ్రోజుల క్రితం మద్రాస్‌ రెజిమెంట్‌ లోని ఆయుధాలు భద్రపరిచే గది తాళా న్ని గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి ఆయుధాలు, మందు గుండు సామగ్రిని అపహరించినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఆర్మీ అధి కారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కేసు కావడంతో దర్యాప్తు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్టు తెలిసింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular