భూపాలపల్లి, నిఘా న్యూస్: జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో సోమ వారం కళాకారుల సందడి నెలకొంది. అంబేద్కర్ సెంటర్లో యక్షగాన కళాకారు లు, కోలాట బృందా లు, డప్పు కళాకారు లు ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.
వారి ప్రదర్శనలు స్థానికులను విశేషం గా అలరించాయి. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు యక్షగాన కళాకారు లు, కోలాట బృందా లు, డప్పు వాయిద్యా లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో కళాకారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.. అంబేద్కర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన సభలో కళాకారులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం జానపద కళలు, కళా కారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు వారికి అవ సరమైన గుర్తింపు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తు న్నామని తెలిపారు. కళలను భావితరా లకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కళాకారుల అభ్యున్నతికి ప్రభు త్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


