మంథని, నిఘా న్యూస్:మంథని పట్టణంలోని మూడవ వార్డు నాలాల పూడికతీత పనులు కొనసాగట్లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ! వాన కాలం కావడంతో నాలాలు పొంగిపొర్లి కాలనీలోకి నీరు చేరి ఇండ్లు మునుగుతున్న మునిసిపల్ అధికారు లు పెద్దగా పట్టించుకో వడం లేదని ఆరోపణ లు ఉన్నాయి, మంథని పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు ఉన్న మురికి కాలువ లో కట్టెలు, పిచ్చి మొక్కల చెట్లు ఏపుగా పెరగడంతో పాటు సమీకృత హాస్టల్ భవనం నుండి వచ్చే మురుగునీరు ముందుకు కదలడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.నాలాల కూడికతీత పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తు న్నామని మునిసిపల్ అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా ఎక్కడ ఆ పనులు జరగడం లేదు. వర్షం పడిందంటే చాలు నాలాలు నిండిపోయి రోడ్లపై నుంచి మురు గునీరు ప్రవహించడం తో కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా మున్సి పల్ అధికారులు స్పందించి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న నాలాలో నిండిపోయి న కర్రలను చెత్తను శుభ్రం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
RELATED ARTICLES


