హైదరాబాద్, నిఘా న్యూస్: మూసీ నది పునరు జ్జీవ ప్రాజెక్టు మొదటి దశ పనులకు అను మతిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది,రూ “7,345 కోట్లతో జోన్- 1 పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది,రూ” 4,500 కోట్ల ఏడీబీ రుణంతో మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ప్రాజెక్టును చేపట్టనుంది
ఇందులో భాగంగా ఏడీబీ నుంచి రూ.4, 500 కోట్ల రుణాన్ని తీసుకోనుండగా.. మిగతా రూ.2,845. 12 కోట్లు హెచ్ఎం డిఏ,లేదా టీజీఐఐసి, నుంచి రుణం తీసు కునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూసీ రివర్‌ఫ్రంట్ పనులను ఈపీసీ విధానంలో నిర్వహిం చనున్నారు. ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ నియామకా నికి సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని ఎమ్‌ఆర్ డీసీఎల్,కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


