పగలు బడిబాట సాయంత్రం జనగణనా?
భూపాలపల్లి, నిఘా న్యూస్ : ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా గురువారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో పాటు… ప్రాథమిక ఉన్నంత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆటలు చదువులు వివిధ కార్యక్రమంలో సా ధించిన విజయాలతో పాటు విద్యార్థులకు అందించే సదుపా యాలను చూపించి ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు పొందేందు కు కృషి చేయవలసి ఉంది. ఈ మేరకు విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అడ్మిషన్ రిజిస్టర్ పెన్ ఎడ్యుకేషన్ పర్మనెంట్ నెంబర్లను నవీకరించి అడ్మిషన్ల ను చేపట్టా ల్సింది.. ఈరోజు నుంచి బడిబాట కార్యక్రమాలు ప్రారంభం కానుండగా ఉపాధ్యాయులు ఇప్ప టికే విద్య వారోత్సవా ల్లో భాగంగా పాలు పాఠశాలల్లో కార్యక్ర మంలో నిర్వహిస్తు న్నారు దీనికి తోడు జనగణన లో కూడా పెద్ద సంఖ్యలో ఉపా ధ్యాయులు పాల్గొని విధులు నిర్వహిస్తు న్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కనీసం 10% అడ్మిషన్ల నమోదు పెంచాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అయితే సరిగ్గా ఇదే సమయం లో మే 11 నుంచి జాతీయస్థాయి జనా భా లెక్కల ప్రక్రియ కూడా ప్రారంభమైంది, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఏన్యూమరే టర్లు, తప్పనిసరిగా ఫీల్డ్ లో ఉండి జన గణన టా ర్గెట్ పూర్తి చేయాలని అధికారు లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఒకే సమయంలో ఒక ఉపాధ్యాయుడు ఇటు పిల్లల అడ్మిషన్ల కోసం బడిబాటలో తిరగా లా? లేక జనాభా లెక్కల సేకరణ చేయాలా? అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది.


