Saturday, May 16, 2026

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఈ ఏపీ సెట్ పరీక్షలు!

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రవ్యా ప్తంగా టీజీ ఈ ఏపీ సెట్- 2026 ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కొరకు నేటి నుండి పరీక్షలు జరగనున్నాయి, ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మొత్తం 6 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నా యి. ఈ ఏడాది మొత్తం 2,10,766 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు.మార్నింగ్ సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

అభ్యర్థులు గంట ముందుగానే తమ పరీ క్షా కేంద్రాన్ని చేరుకునే విధంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవా లని అధికారులు సూచించారు.ఉదయం సెషన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థు లను ఉదయం 7:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమ తిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

మధ్యాహ్న సెషన్‌లో పరీక్ష రాసే విద్యార్థు లను మధ్యాహ్నం 1:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అను మతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత, అలాగే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్య ర్థులను పరీక్షా కేంద్రా ల్లోకి అనుమతించ బోమని, ఈఏపీసెట్ కన్వీనర్ డాక్టర్ కే విజయ్ కుమార్ రెడ్డి,ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

అభ్యర్థులు పాటించవలసిన సూత్రాలు!

అభ్యర్థులు తప్పని సరిగా బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డు వెంట తీసుకురావాలని స్పష్టం చేశారు. కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పరీక్షా కేంద్రాల్లో నిషేధమని స్పష్టం చేశారు.

పరీక్ష పూర్తైన వెంటనే స్క్రీన్‌పై మార్కుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా నార్మలైజ్డ్ మార్కులు లెక్కించి ర్యాంకులను కేటాయిం చనున్నట్లు అధికారు లు పేర్కొన్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular