Friday, May 15, 2026

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి, సరెండర్!

భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన నరహరి!

హైదరాబాద్ , నిఘా న్యూస్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి, అలియాస్ సంతోష్, మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట తొంగిపోయా రు. అయన స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1996లో అజ్ఞాతం లోకి వెళ్లిన నరహరి, సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.

పార్టీలో టెక్నికల్ వింగ్ మరియు మిలిటరీ ఆపరేషన్లలో ఆరితేరిన ఆయన, ఇటీవల కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. ఝార్ఖండ్‌ లో పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ర కోసం పోలీసులు జరుపుతున్న గాలింపు చర్యల వేళ, తప్పించు కునే మార్గం లేక పోలీ సులకు లొంగి పోయి నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31, 2026 గడువు లోపు మావోయిస్టు రహిత భారత్‌ను నిర్మించాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు దాడులను తీవ్రం చేశాయి. ఈ క్రమంలో ఇప్పటికే గణపతి, తిప్పరి తిరుపతి దేవుజీ,వంటి అగ్ర నేతలు లొంగిపోగా… తాజాగా నరహరి లొంగుబాటు పార్టీకి పెద్ద దెబ్బగా మారింది.

ప్రస్తుతం పరారీలో ఉన్న మరో కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు గణపతి కోసం కూడా గాలింపు కొనసాగు తోంది.నరహరి లొంగు బాటుతో ఆయన స్వగ్రామం సోమిడిలో నిశ్శబ్దం నెలకొనగా, ఆయన భార్య ఏపీకి చెందిన మహిళ కూడా ఆయనతో పాటే లొంగి పోయినట్లు పోలీసులు ధృవీకరించారు.

ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీ కింద వారికి ఆర్థిక సాయం, రక్షణ కల్పి స్తామని అధికారులు ప్రకటించారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular