Friday, May 15, 2026

ఎగ్లాస్ పూర్ సర్కారు బడిలో సమ్మర్ క్యాంప్!

పెద్దపల్లి, నిఘా న్యూస్: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఈరోజు 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వ హించనుంది, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటు న్న ఈ చర్యలతో విద్యానాణ్యత మెరుగుదలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశ్యమని, అధికారులు చెబు తున్నారు. దీనిలో భాగంగానే..

పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలోని పి ఎం ఎస్ హెచ్ ఆర్ ఐ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంప్ కార్యక్రమం ప్రారంభించారు. గ్రామ పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ఈ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి జ్యోతి తెలిపా రు. అలాగే గ్రామ ప్రజల సౌకర్యనార్థం వాకింగ్ ట్రాక్ ను మం థని ఎంఈఓ దాసరి లక్ష్మి ప్రారంభించారు.

ఈ సమ్మర్ క్యాంపు కార్యక్రమంలో ఆటలు, నృత్యాలు, పాటలు, సంగీతం నేర్పుటకు కళాకారిణి డ్యాన్స్ మాస్టర్ కుమారి, పిల్లలకు డ్యాన్స్ లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ముత్తారం ఎంఈఓ ఎన్ హరిప్రసాద్, గ్రామ సర్పంచ్ బి రజిత, తోపాటు….

పాఠశాల ఉపాధ్యాయులు
వి జ్యోతి, ఎం అనిత, మంథని రాజశేఖర్, ములుకల్ల రాజశేఖర్, జె మంజుల, డాన్స్ మాస్టర్ ఆకాంక్ష, వార్డు సభ్యులు,
విద్యార్థులు, విద్యా ర్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular