Sunday, March 22, 2026

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: సర్పంచ్ ఆర్ల నాగరాజు!

మంథని, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, సూరయ్యపల్లి గ్రామ సర్పంచ్ ఆర్ల నాగరాజు అన్నారు. గ్రామంలో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన ఆదివారం భూమి పూజ చేశారు.

మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రైతువేదిక నుండి తేనుగు గూడెం వరకు గ్రామపంచా యతీ కార్యాలయం నుండి పోచమ్మ దేవాలయం వరకు 15 లక్షల రూపాయలతో ఈజీఎస్ ఫండ్ కింద మంజూరైన సిసి రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి ఆయన పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచి ఆర్ల నాగరాజు మాట్లాడుతూ… సూర్య పల్లె గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి సూరయ్యపల్లి గ్రామ అభివృద్ధికి తోడ్పడిన ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, తోపాటు టిపిసిసి సభ్యులు దుద్దిల్ల శ్రీను బాబు,కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఆరేల్లి సుచిత, గ్రామపంచాయతీ పాలకవర్గం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకులకిరణ్, ఆరెల్లి కిరణ్ గౌడ్, గ్రామ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular