Tuesday, March 10, 2026

చరిత్ర తిరగరాసిన భారత్ జట్టు..

హైదరాబాద్, నిఘా న్యూస్:టి20 వరల్డ్ కప్ 2026 విశ్వ విజేతగా భారత నిలిచింది, ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి,టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది.

అత్యధిక టీ20 ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. టీ20 ప్రపంచ కప్‌ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించడంతో ఈ అరుదైన ఘనత అందుకుంది. టీమిండియా ఇప్పటివరకు మూడు టీ20 ప్రపంచ కప్‌లు గెలుచుకుంది. 2007, 2024, 2026 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకుని.. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వరల్డ్‌ కప్‌ టైటిళ్లు గెలిచిన జట్టుగా నిలిచింది.

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో భారత్‌ విజేతగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా.. కప్ గెలిచి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు కప్ కలగానే మిగిలింది. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో మరోసారి భారత్ పొట్టి ట్రోఫీని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026లో మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుని కొత్త చరిత్రను సృష్టించింది.

ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్లు రెండేసి సార్లు టైటిళ్లు గెలుచుకున్నాయి. ఇంగ్లాండ్‌ 2010, 2022 సంవత్సరాల్లో ట్రోఫీని అందుకుంది. వెస్టిండీస్‌ 2012, 2016లో విజేతగా నిలిచి టీ20 ఫార్మాట్‌లో తమ బలాన్ని చూపించింది. పాకిస్థాన్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఒక్కోసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి.

పాకిస్థాన్‌ 2009లో విజేత గా నిలిచింది. శ్రీలంక 2014లో ట్రోఫీని అందుకో గా.. ఆస్ట్రేలియా 2021లో టీ20 ప్రపంచకప్‌ను గెలు చుకుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్‌ అత్య ధిక టైటిళ్లు గెలుచుకున్న జట్టుగా నిలిచి తన సత్తాను ప్రపంచానికి చూపించింది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular