మంథని, నిఘా న్యూస్:మంథని పట్టణ కేంద్రం లోని పోషమ్మ వాడకు చెందిన పిల్లి సత్తయ్య, రాజకీయ నాయకుడి గా సామాజిక సేవకుడి గా అందరి మన్ననలు పొందుతున్నాడు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రశంసలు కూడా అందుకున్నా రు. టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే ఇలాంటి వారు పార్టీకి ఎంతో అవసరమని, బిఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల, నాయకులు మెచ్చుకుంటున్నారు. ఆయనసేవలు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సోమవారం మంథని ఆర్టిసి బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఆదేశాల మేరకు పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వ ర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లి సత్తయ్య, సామాజిక సేవలో భాగంగా.. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
దీంతోపాటు.. పిల్ల తల్లులు చంటి బిడ్డల తో ప్రయాణం చేసే సమయంలో నలుగురి లో కూర్చుని తమ పిల్లలకు పాలు ఇచ్చేం దుకు తల్లులు చాలా ఇబ్బంది పడుతుంటా రు. ఈ క్రమంలో వారు ఇలాంటి ఇబ్బందులు పడకుండా పిల్లి సత్త య్య, తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చేందు కు అనువుగా అన్ని సౌకర్యాలతో కూడిన ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేశాడు.
గతంలో కూడా ప్రయా ణికుల సౌకర్యనార్థం బస్సు షెల్టర్ నిర్మాణం, అలాగే పోచమ్మ వాడ నుండి గోదావరిఖనికి వెళ్లే మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను సొంత ఖర్చులతో చేపట్టారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏగోళపు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్,తోపాటు
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమా ర్, మాజీ కౌన్సిలర్ కాయితీ సమ్మయ్య, నాయకులు కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, అంబటి నర్సింగ్, పోలు కనకరాజు, ఎస్.కె జావిద్ తదితరులు పాల్గొన్నారు.


