Tuesday, March 10, 2026

మహిళా పోలీసులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు: ఏసీపీ మడత రమేష్!

పెద్దపల్లి , నిఘా న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మడత రమేష్, పోలీస్ అధికారులతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపు కున్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులు, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ…. మహిళల్లో సంకల్పశక్తి ఎక్కువగా ఉంటుందని, వారు ఏ రంగంలోనైనా గొప్ప విజయాలు సాధించగలరని అన్నారు.

దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో హక్కులు ఉన్నాయని తెలిపారు. మహిళా అధికారులు తమ పూర్తి శక్తి, సామర్థ్యాలతో విధులు నిర్వహిస్తూ సమాజంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు.

పురుషుల కంటే మహిళల్లో నిబద్ధత ఎక్కువగా ఉంటుందని, పలు విభాగాల్లో మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా సేవలం దిస్తున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విధులు, కోర్టు డ్యూటీ ఆఫీసర్, రైటర్, పెట్రోలింగ్, బ్లూ కోట్స్, సైబర్ వారియర్స్, పాఠశాలలు మరియు కళాశాలల్లో షీ టీమ్స్ ద్వారా సైబర్ క్రైమ్‌లపై అవగాహన కార్యక్రమాలు, ముఖ్యమైన బందోబస్త్ బాధ్యతలను మహిళా పోలీస్ అధికారు లు, సిబ్బంది సమర్థంగా నిర్వహిస్తున్నారని అన్నారు.

గృహహింస, వైవాహిక వివాదాల వంటి కేసుల్లో బాధిత మహిళలకు కౌన్సె లింగ్ అందిస్తూ మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అభినం దించారు.మహిళలు పలు రంగాల్లో సాధిస్తున్న విజయాలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, ఏసిపి పేర్కొన్నారు,

మహిళా అధికారులు ధైర్యంగా ఉండి తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. మహిళా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం ఎస్సై సంధ్యారాణి, రామగిరి ఎస్సై దివ్య, గోదావరిఖని వన్ టౌన్ ఎస్సై అనూష, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular