Thursday, March 5, 2026

నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన?

హైదరాబాద్, నిఘాన్యూస్ :హైదరాబాద్ లో మారిన వాతావరణ పరిస్థితులు బంగాళాఖాతంలో మరో సారి అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఒక్కసారిగా వాతావ రణంలో పరిస్థితులు మారిపోయాయి.తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి సాధారణం గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఉదయం నుంచి రాత్రి వరకు తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రలో మేఘాలు కమ్ముకుని ఉంటాయి. రాయలసీమలో ఎండ కొడుతుంది. అయితే సాయంత్రం 4 తర్వాత నుంచి సీమలో మేఘాలు కమ్ముకుంటాయి.మధ్యాహ్నం 12గంటల నుంచి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. ఇవి తేలిక పాటి నుంచి మోస్తరు గా..అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 3 తర్వాత నుంచి కోస్తాలో కూడా వర్షలు కురిసే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వర్షాలు అంతటా ఒకే విధంగా ఉండవని తెలిపింది. కాగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయా యి. గురువారం మధ్యా హ్నం భారీ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.జనం ఉక్కపోతకు గుర య్యారు. కానీ శుక్రవారం రాత్రి వరకు వాతావరణం పరిస్థితులు మారనున్నా యి,ఆకాశం మేఘాలు కమ్ముకుని తేమతో కూడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular