Monday, April 20, 2026

కౌశిక్ రెడ్డికి యశస్విని రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్, నిఘా న్యూస్: అసెంబ్లీ సమావేశాలలో నిన్నటి నుంచి చూస్తున్నా ఈ లొల్లేంది అంటూ బీఆర్ఎస్ నేతలపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆమె ప్రత్యర్థి నాయకుల ఆరోపణలకు ఒక్కొక్కటిగా కౌంటర్ ఇస్తూ తనదైన శైలిలో స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడియం శ్రీహరి తమ అందరికీ తండ్రి లాంటి వారని అన్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే రాజకీయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. అలాగే గత పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ కాలంలో జరిగిన కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరపాలని ప్రజల సొమ్మును లూటీ చేసింది ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. వారి పాలన దౌర్జన్య పాలన, కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతోంది అంటూ స్పష్టం చేశారు యశస్విని రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారగా రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా నిలిచాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular