Monday, May 25, 2026

ప్రజలకు,ప్రభుత్వానికి వారధిల డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్

పెద్దపల్లి, నిఘా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్,లో ఇటీవల నూతనంగా ఎన్నికైన, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను మంథని మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి, సోమవారం ఘనంగా సన్మానించారు. కాగా..నూతన కార్యవర్గ సభ్యులకు సాలువాలతో సన్మా నించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీలత క్రాంతి మాట్లాడుతూ.. మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ పాత్రికేయులు మండ లంలో పారదర్శకంగా బాధ్యతయుతంగా ప్రజా సమస్యలపై పరిష్కారానికి బాటలు వేస్తూ.. సమాజానికి సేవలు అందిస్తున్నా రని,వారు అన్నారు. జర్నలిజం అనేది సమాజానికి అద్దం పట్టే వృత్తి అని ఎవరికి భయపడకుండా ప్రజలకు,ప్రభుత్వానికి వారదిగా నిలిచి క్షేత్ర స్థాయిలో సమాజంలో ఉన్న సమస్యలను వెలికి తీసి పరిష్కా రానికి చొరవ చూపాల న్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొడారి మల్లేశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్, మండల కన్వీనర్, ఏ గోలపు సంతోష్ గౌడ్, మండల కో కన్వీనర్ కాచర్ల శంకర్, డివిజన్ కార్యవర్గ సభ్యులు రామడుగు సాయి శ్రీనివాస్, డివిజన్ కార్యవర్గ సభ్యుడు మాదేశి శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular