Tuesday, April 14, 2026

ఈనెల 13న టెట్ నోటిఫికేషన్!

హైదరాబాద్, నిఘా న్యూస్:తెలంగాణ రాష్ట్రంలో 2026 సంవత్సరానికి గాను ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది, ఏడాదికి రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉండగా… ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అందుకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనుంది,

టీచ‌ర్ ఎలిజ‌బిలిటీ ప‌రీక్ష పాసైతేనే డీఎస్సీ రాసేందు కు అర్హ‌త సాధించిన‌ట్టు. లేదంటే డీఎస్సీ రాత‌ప‌రీక్ష రాసేందుకు వీల్లేదు. విద్యాశాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. టెట్ ప‌రీక్ష ఏడాదికి రెండుసార్లు నిర్వ‌హించాలి. 2026లో ఇప్ప‌టి వ‌ర‌కు టెట్ నిర్వ‌హించ‌లేదు. ఈ క్ర‌మం లో టెట్-2026 నిర్వ‌హ‌ణ‌ కు ఇటీవ‌లే పాఠ‌శాల విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపంగా ప‌చ్చ‌జెండా ఊపింది.

ఈ ఏడాది జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షలకు మొత్తం 1.95 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యా రు. వీరిలో లక్ష మంది 51.37%, అర్హత సాధించారు. పేపర్ 1 లో 72%, పేపర్ 2 లో 39. 11%, క్వాలిఫై అయ్యారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు టెట్ తప్పనిసరి అయింది…

అయితే టెట్‌ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇస్తారని భావించి కొన్ని వేలమంది ఆనాడు దరఖాస్తు చేయలేదు. ఈసారి టెట్ ద‌ర‌ఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవ‌కాశం ఉంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular