కరీంనగర్, నిఘా న్యూస్:మహిళలతో పాటు, కిశోర బాలికలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీకారం చుట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యచర ణలో భాగంగా… ఈరోజు నుండి మే 23 వరకు నిర్వహించను న్న కిశోర బాలికల ప్రత్యేక ఆరోగ్య శిబి రాన్ని ఈరోజు జమ్మి కుంట పాత మున్సి పల్ కార్యాలయంలో ఆయన ప్రారంభించా రు.కిషోరా బాలికలకు మెప్మా,వావిలాల ప్రాథ మిక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్యులు చందన, బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించా రు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ శ్రవణ్ కుమా ర్,లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ చందన,మాట్లాడుతూ, 15-18 సంవత్సరాలు ఉన్న కిషోరా బాలిక లకు హిమోగ్లోబిన్, షుగర్ వంటి పరీక్షలు నిర్హించినట్లు వారు తెలిపారు. బాలికలు విధిగా పౌష్టికమైన ఆహారం తీసుకోవాల న్నారు. బాలికలకు ఎటువంటి సందేహాలు ఉన్న నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్తీ ఆఫీసర్ మొలుగు చందన, హెల్త్ సూపర్ వైజర్ అరుణ, కొండపాక సదానందం హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏ ఎన్ ఎం రాధ, మెప్మా సి.ఎల్.అర్పిలు జ్యోతి, అర్పిలు, ఆశ వర్కర్ల తో పాటు కిషోరా బాలికలు పలువురు పాల్గొన్నారు.


