Monday, April 20, 2026

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు?

హైదరాబాద్, నిఘా న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

ఏళ్ల తరబడి వారు ఎదుర్కొంటున్న వేతన కష్టాలకు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి శాశ్వత ముగింపు పలుకుతూ ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై దళారుల ప్రమేయం లేకుండా, ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని ప్రభుత్వం తీర్మానించింది.

ఈ నిర్ణయంతో లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.ప్రభుత్వం ఏజెన్సీలకు నిధులు మంజూరు చేసినా, ఆ కాంట్రాక్టర్లు లేదా ఏజెన్సీలు సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేసేవారు.

పీఎఫ్, ఈఎస్ఐ,వంటివి కట్ చేసినా అవి వారి ఖాతాల్లో జమ అయ్యేవి కావు. పైగా మధ్యవర్తులు కమీషన్ల రూపంలో కార్మికుల శ్రమను దోచుకునేవారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ఈ మధ్యవర్తుల వ్యవస్థకు పూర్తిగా చెక్ పడనుంది.

వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల నుంచి నేరుగా జీతాలు అందనున్నాయి.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular