హైదరాబాద్, నిఘా న్యూస్: పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా పెట్రోలు డీజిల్ దొరకదన్న భయంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తుండడంతో ఈ భయం వాహనదారులు మరింత పెరిగింది దీంతో పెట్రోలు డీజిల్ కోసం ఎక్కడ చూసినా బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలు కనబడుతున్నాయి,
ఇంధన కొరత ఏర్పడిందనే వదంతులు వేగంగా వ్యా పించడంతో బుధవారం హైదరాబాద్ సిటీ తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది,దీంతో తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకు నేందుకు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఫలితంగా నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడ్డాయి. కూకట్‌పల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, అబిడ్స్ సహా పలు ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
గంటల తరబడి వాహనదారులు క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయం లో కొన్ని బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం తో ప్రజల ఆందోళన మరింత పెరిగింది. ఈ పరిణామంపై అధికారులు స్పందించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నగరానికి అవసరమైనంత ఇంధనం నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


