Friday, November 20, 2026

రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ భూమి పూజ!

పెద్దపల్లి జిల్లా, నిఘాన్యూస్:పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో మంగళ వారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పర్యటించారు. మండల కేంద్రంలో ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..ప్రజల సమస్యల పరి ష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు.

ఎలిగేడు మండల కేంద్రంలో రూ.5 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ భూమిపూజ చేశారు.రోడ్డు సౌకర్యం లేక ఇబ్బం దులు పడుతున్నా మని గతంలో కాలనీవాసులు ఎంపీ దృష్టికి తీసుకురాగా…

వెంటనే స్పందించి తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయించి రోడ్డు నిర్మాణ పను లకు భూమిపూజ నిర్వహించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular