Sunday, April 26, 2026

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

బెజ్జంకి జనవరి17(నిఘా న్యూస్) మండలంలోని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం సుడిగాలి పర్యటన జరిపారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చీలాపూర్ పల్లె, చీలాపూర్, గుండారం గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు, బెజ్జంకి, పోతారం గ్రామాల్లో అంగన్ వాడీ కేంద్ర భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు,అంగన్వాడీ భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టామన్నారు.

-సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…
బెజ్జంకి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చెశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మానకొండూర్ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం వంటిదన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స చేయించుకున్న వారు నిర్ణీత గడువులోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే ఆస్పత్రులలో మందులు అందుబాటులో ఉంచడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఎఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, పోతారం, చీలాపూర్ పల్లి, చీలాపూర్, గుండారం, బెజ్జంకి గ్రామాల పార్టీ అధ్యక్షులు కె. బాబు, కోటి, పి. ఉమేష్, పి. పోచయ్య, బి. రాజు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular