హైదరాబాద్, నిఘా న్యూస్: తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏపీ, తెలంగాణలోని ప్రైవే ట్,ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రా రంభం కానున్నాయి. ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుం చి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో ముగియను న్నాయి.
ఈ మేరకు ఇప్పటికే ఆయా తెలుగు రాష్ట్రా ల్లోని ఇంటర్ బోర్డులు కొత్త విద్యా సంవత్స రం క్యాలెండర్లను సైతం జారీ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియ ట్‌లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్ సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి పాఠకులకు తెలిసిందే…
ఇక తెలంగాణలోనూ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబం ధించిన అకడమిక్ క్యాలెండర్‌ను మార్చి 30 విడుదల చేసింది. క్యాలెండర్ ప్రకారం ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు జూన్ నెల ఆరంభం నుంచే ప్రారం భం కానున్నాయి.
ఈ ఏడాదికి మొత్తం 224 పని దినాలు ఉండనున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రా ల్లో ముమ్మరంగా ఇం టర్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరో వైపు స్కూల్ పిల్లలకు జూన్ 11వ తేదీ వర కు వేసవి సెలవులు కొనసాగనున్నాయి.
జూన్ 12వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ తిరిగి తెరచుకో నున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం విద్యార్ధు లు జూన్ 12 నుంచి బడిబాట పట్టనున్నా రు.


