హైదరాబాద్, నిఘాన్యూస్ ప్రతినిధి: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్‌లో ఓ పెయింట్ షాపులో శనివారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి మంటలు వేగంగా పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళ నకు గురయ్యారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథ మికంగా అంచనా వేస్తున్నారు.అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
రాజనాల శ్రీహరి పెయింట్ షాపులో ఒక్కసారిగా మంటలు న్యూ హఫీజ్‌పేట్‌లో ఉన్న పెయింట్ షాపులో ఈ ఉదయం ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. మొదట షాపులో కనిపించిన మంట లు కొద్దిసేపటికే తీవ్రంగా వ్యాపించా యి. పెయింట్లు, ఇతర దహనశీల పదార్థాలు ఉండ టంతో మంటలు వేగంగా విస్తరించి నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో షాపు పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి. మూడు భవనాల నుంచి పొగ, మంట లు కనిపించడంతో స్థానికులు ఆందో ళనకు గురయ్యారు. సమాచారం అంద గానే రంగంలోకి ఫైర్ సిబ్బంది పెయింట్ షాపులో మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
దీంతో ఫైర్ సిబ్బంది అగ్ని మాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చివరకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకు న్నారు. మూడు భవనాలకు నష్టం వాటిల్లింది,ఈ ప్రమాదంలో పెయిం ట్ షాపుతో పాటు పక్కనే ఉన్న మరో రెండు భవనాలు దెబ్బతిన్నాయి. షాపులోని వస్తువులు, ఇతర సామగ్రి మంటల్లో కాలిపోయినట్లు సమాచారం.
మొత్తం ఆస్తి నష్టం సుమారు కోటి రూపాయల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారు ల పరిశీలన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పో లేదు. ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు కూడా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.


