Monday, April 20, 2026

దిశ రిపోర్టర్ ను పరామర్శించిన ప్రజాసంఘాల నాయకులు!

మంథని, నిఘాన్యూస్: మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు మంథని డివిజన్ దిశ పత్రిక ఆర్సీ ఇంచార్జ్ మాదరబోయిన కిషన్ ను ప్రజా సంఘాల నాయకులు సోమవారం పరామర్శించారు.

మంథని మండలం కాకర్ల పల్లి గ్రామానికి చెందిన మాదరబోయిన కిషన్, గత వారం తన వ్యక్తిగత పని నిమిత్తం పెద్దపల్లి నుండి మంథనికి తన బైక్ పై వస్తుండగా సబ్బితం గ్రామ శివారులో కోతుల గుంపు ఒక్కసారి అడ్డురావడంతొ వాటిని తప్పించబోయి ప్రమాదానికి గురికాగా..

చెయ్యి ఫ్యాక్చర్ అయ్యి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చినా ఆయనను భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పరామర్శించి సమయాన్ని వృధా చేసుకోకుండా ఆయన చదువుకోవడానికి బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదం పుస్తకాన్ని బహుకరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో పెద్దపల్లి జిల్లా ప్రజాసంఘాల నాయకులు బూడిద గణేష్, ఆర్ల సందీప్, గొర్రెంకల సురేష్, మంథని లింగయ్య, లు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular