హైదరాబాద్, నిఘా న్యూస్ :లష్కర్ బోనాలతో సికింద్రా బాద్ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరు స్తోంది. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.నిన్న ఆదివారం అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యా యి. మొదటి రోజు మహం కాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రభు త్వం తరుపున మొదటి బోనం సమర్పించడంతో అమ్మవారి బోనాల ప్రక్రియ ప్రారంభమయ్యాయి.
లక్షలాది భక్తుల మొక్కులు, వేలాది బోనాల సమర్పణ తో మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. పోత రాజుల ఆటపాటలతో ఫలహారం బండి ఊరేగుంపులతో ఈ రోజు తెల్లవారు జామున తొలి రోజు బోనాల సంబరాలు ముగిసాయి.మహంకాళి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ రెండో రోజు కొనసాగు తుంది. వడి బియ్యం, చీరా సారెలతో అమ్మవారికి భక్తు లు మొక్కులు సమర్పించు కుంటున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మ వారిని నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించు కున్నారు.
ఉదయం అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసిన సీఎం మొక్కులు చెల్లించారు.అనంతరం ఆలయ పండి తులు సీఎంకు వేదమం త్రో చ్ఛరణల నడుమ దీవించి.. అమ్మవారి తీర్థప్రసాదాలు అంద జేశారు. ఆలయ పండితులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి శేష వస్త్రంను సీఎంకు అందించారు..


