రాజన్న సిరిసిల్ల జిల్లా, నిఘా న్యూస్ : వేములవాడ రాజన్న సన్నిధికి కార్తీకమాసం శోభ సంతరించుకుంది, మంగళవారం నుంచి నెల రోజుల పాటు శివాలయాలు విశేష పూజలతో శోభయామానంగా కనిపించనున్నాయి, స్వామివారికి పూజలతో పాటు భక్తులు ఉపవాస దీక్షలు కొనసాగించ డం విశేషం..కార్తీక మాసం ప్రారం భం సందర్భంగా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దేవ స్థానంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాల నిర్వహణకు ఆల య అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు నెలరోజుల పాటు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమా లు చేపట్టనున్నారు.
అయితే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన ఆలయంలో స్వామి వారికి ఏకాంతంగా పూజలు నిర్వహిం చనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించా యి. కార్తీక మాసాన్ని పురస్క రించుకొని రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోనూ నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి.కార్తీక మాసంలోని ప్రతి సోమవారం ప్రధాన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఏకాంతంగా మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోనూ స్వామివారికి రుద్రాభిషేకం జరపనున్నారు.
ఈ నెల 21వ తేదీన కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీకృష్ణ తులసి కల్యా ణం జరగనుంది.అలాగే నవంబర్ 24న కార్తీక పౌర్ణమి, వైకుంఠ చతుర్దశి సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అన్నపూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


