Monday, January 19, 2026

కరీంనగర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్: చెల్లని ఓట్లే ఎక్కువ..

కరీంనగర్, నిఘా న్యూస్:   కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గ అభ్యర్థుల ఓట్లు లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులు ముందుగా బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ చేసి అందులోని బ్యాలెట్ పేపర్లను సరి చేశారు. ఆ తర్వాత పేపర్లన్నీ ఒక్కటి గా చేర్చారు. అయితే ఇందులో ఎక్కువ శాతం చెల్లని ఓట్లే వచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. మధ్యాహ్నం వరకు 21 టేబుల్ లపై 499 పట్టభద్రులబ్యాలెట్ బాక్స్లను ఉంచారు. అలాగే 14 టేబుల్స్ పై 274 ఉపాధ్యాయ బ్యాలెట్ బాక్సులను పెట్టి లెక్కించారు. అయితే ప్రతి బాక్స్ నుంచి కనీసం 30 వరకు చెల్లని ఓట్లు వస్తున్నాయి. దీంతో కౌంటింగ్ సిబ్బంది వీటిని ప్రత్యేకంగా వేరు చేస్తున్నారు. ఇలా చల్లని ఓట్లు చెల్లిని ఓట్లు సపరేట్ చేసిన తర్వాతనే కౌంటింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ, మల్కా కొమురయ్య వచ్చారు. వీరు కౌంటింగ్ ను పరిశీలించారు. అయితే మరిన్ని ఎక్కువగా  చెల్లని ఓట్లు వస్తే కౌంటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular